Monday, April 29, 2024

TS: కరీంనగర్ నుండే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం.. బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్ ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పనులను పరిశీలించారు. కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులతోపాటు జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతోనూ చర్చించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి తెలంగాణకు వస్తున్నారు. మూడు క్లస్టర్ మీటింగుల్లో పాల్గొంటారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ మీటింగ్ లో పాల్గొంటారు. వీటితోపాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారన్నారు. అందులో భాగంగా ఈనెల 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారన్నారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారన్నారు. 10 వేల నుండి 20 వేల మంది కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తారన్నారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాబట్టి ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చింది ? ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందనే అంశంపై పూర్తి వివరాలను గ్రామాల వారీగా వివరిస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర ప్రారంభిస్తున్నానన్నారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తా. సమయాభావాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లేటప్పుడు మాత్రం వెహికల్ లో వెళతానని, దాదాపు 20 రోజులపాటు యాత్ర కొనసాగిస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తా… కేంద్రం చేసిన కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తానన్నారు.

- Advertisement -

గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ…..

బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు రద్దు చేశారు… గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఒక మహిళా గవర్నర్ ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారన్నారు. గవర్నర్ పర్యటనలకు ప్రోటోకాల్ పాటించలేదు. అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన పార్టీ బీఆర్ఎస్. అందుకే ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. వాళ్ల అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే ఉన్నారన్నారు… గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలనుకుంటున్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేసే వాళ్లు వాళ్లకు పనికిరారు. రాజ్యాంగాన్నే మార్చాలని అంబేద్కర్ ను అవమానించారన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామిక దేశం ఏదంటే ఠక్కున ఇండియా పేరే చెబుతారంటే.. మన రాజ్యాంగం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలన్నారు.

ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయి.. కానీ భారత్ మాత్రం రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినా… మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకుండా చెక్కుచెదరకుండా ఉన్న గొప్పతనం మన రాజ్యాంగానిదేేనన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీది మూడో స్థానమే… ఇంకా గుండా గిరి చేస్తాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారు జాగ్రత్త అని బండి సంజయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement