Saturday, May 18, 2024

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షకీలా

షకీలా…. దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం అవసరం లేదు. షకీలా సినిమా అంటే థియేటర్ లు అప్పట్లో కళకళలాడేవి. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి షకీలా అడుగుపెట్టారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో షకీలా ఇక నుంచి పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక షకీలా సినీ జీవితానికి వస్తే 18 ఏళ్ల వయసులోనే సినిమాలలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 200 లకు పైగా సినిమాలలో నటించారు.ఇక ఇటీవల షకీలా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement