Friday, April 26, 2024

మార్చి 28న.. శాకుంత‌లం 3డీ ట్రైల‌ర్

ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం శాకుంతలం..ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్‌ ఇండియా స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు…కాగా ఈ మూవీ 3డీ ట్రైలర్‌ను మార్చి 28న సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. ప్రసాద్స్‌ ఐమాక్స్‌ స్క్రీన్‌ -6లో ఈ లాంఛింగ్ ఈవెంట్‌ ఉండనున్నట్టు తెలియజేశారు. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందుకునేందుకు రెడీగా ఉండండి అంటూ కొత్త అప్‌డేట్‌తో విడుదల చేసిన పోస్టర్.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో మైథ‌లాజిక‌ల్ డ్రామాగా శాకుంతలం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. శాకుంత‌ల‌గా స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తోంది. అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement