Wednesday, April 24, 2024

కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెష‌న్ లో కూలిన హెలికాఫ్ట‌ర్.. ఇద్ద‌రికి గాయాలు

కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెష‌న్ లో టేకాఫ్ అవుతుండ‌గా హెలికాఫ్ట‌ర్ కూలిపోయింది. దాంతో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి.వారిని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. ట్రైనింగ్ ఫ్లైట్ కోసం నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే రన్ వేకు ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్‌వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement