Thursday, May 2, 2024

స్కార్పియో ఎన్‌ సరికొత్త రికార్డ్‌.. 30 నిముషాల్లో లక్ష బుకింగ్స్

మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ తన సరికొత్త స్కార్పియో ఎన్‌ బుకింగ్స్‌ ప్రారంభించిన 30 నిముషాల్లో లక్ష బుకింగ్స్‌తో రికార్డ్‌ సృష్టించింది. శనివారం ఉదయం 11 గంటలకు కంపెనీ స్పార్పియోఎన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ బుకింగ్స్‌ విలువ 18000 కోట్ల రూపాయలని కంపెనీ వెల్లడించింది. భారీగా బుకింగ్స్‌ పెరగడంతో వెబ్‌ సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొనుగోలుదారులు మహీంద్రా కంపెనీపైనా, చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఇలా చేశారంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు. కంపెనీ ఇప్పటి వరకు విడుదల చేసిన ఏ కారు మోడల్‌కు కూడా ఇంత వేగంగా బుకింగ్స్‌ రాలేదని కంపెనీ తెలిపింది. స్కార్పియో ఎన్‌ బుకింగ్‌ ప్రారంభమైన ఒక్క నిముషంలోనే 25 వేల బుకింగ్స్‌ వచ్చాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందు కంపెనీ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 మోడల్‌కు 57 నిముషాల్లో లక్ష బుకింగ్స్‌ వచ్చాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో ఈ మోడల్‌ బుకింగ్స్‌ ప్రారంభించారు.

కొత్త స్కార్పియో ఎన్‌ కార్లను ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 26 నుంచి కస్టమర్లకు అందించనున్నారు. 2022, డిసెంబర్‌ నాటికి 20 వేల స్కార్పియో ఎన్‌ కార్లను డెలివరీ చేస్తామని కంపెనీ వెల్లడించింది. భారీ బుకింగ్స్‌ మూలంగా వెబ్‌సైట్‌ పేమెంట్‌ గేట్‌వేలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకటించినట్లుగానే మొదటి 25 వేల బుకింగ్స్‌కు ఆఫర్‌ రేటులోనే వెహికల్‌ను అందిస్తామని ప్రకటించింది. బుకింగ్‌ తరువాత సాంకేతిక సమస్య మూలంగా సకాలంలో చెల్లించలేకపోయిన వారికి వారు బుక్‌ చేసిన వరస క్రమం ప్రకారమే జాబితాను ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆర్డర్‌లో వరస క్రమంలో వచ్చిన 25 వేల అప్లికేషన్లను కంపెనీ ఆఫర్‌ రేటుకు అందిస్తుందని తెలిపింది. కంపెనీ ఆన్‌లైన్‌లోనూ, డీలర్ల నుంచి కూడా బుకింగ్స్‌ను కొనసాగించనున్నట్లు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement