Friday, April 19, 2024

ముదురుతున్న ట్విట్టర్‌ -మస్క్‌ వివాదం..

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్విట్టర్‌కు మధ్య లీగల్‌ వివాదం ముదురుతోంది. ట్విట్టర్‌ కొనుగోలు నుంచి మస్క్‌ తప్పుకోవడంతో ఆ సంస్థ ఆయనపై కోర్టులో దావా వేసింది. తాజాగా ఎలాన్‌ మస్క్‌ కూడా ట్విట్టర్‌పై కోర్టులో కౌంటర్‌ దావా వేశారు. ట్విట్టర్‌ దావాపై ఈ ఏడాది అక్టోబర్‌లో విచారణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే మస్క్‌ కూడా దావా వేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక మంధ్యమ సంస్థ ట్విట్టర్‌ను 3.50 లక్షల కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న ఎ లాన్‌ మస్క్‌ దాన్ని రద్దు చేసుకున్నారు.

నకిలీ ఖాతాల సంఖ్యపై తాము అడిగిన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో ఆయన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఎలాన్‌ మస్క్‌పై ట్విట్టర్‌ కోర్డును ఆశ్రయించింది. షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ట్విట్టర్‌ కోర్టును కోరింది. ఒప్పందం ప్రకారం ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఆదేశించాలని ఆ దావాలో కోర్టును కోరింది. ట్విట్టర్‌ వేసిన దావాపై అక్టోబర్‌ 17 నుంచి 21 వరకు విచారణ జరుపుతామని డెలావర్‌ కోర్టు ప్రకటించింది. ఇదే సమయంలో ఎలాన్‌ మస్క్‌ కూడా ట్విట్టర్‌పై కౌంటర్‌ దావా వేశారు. దీనిపై ట్విట్టర్‌ ఇంకా స్పందించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement