Friday, April 19, 2024

విద్యుత్‌ బోర్డులకు బకాయిలు చెల్లించాల్సిందే : ప్రధాన మంత్రి..

రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు బాకీలను, విద్యుత్‌ బిల్లులను తప్పక చెల్లించాల్సిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఇంధన రంగంలో సుస్థిరత కోసం ఎలాంటి బాకీలు పెట్టవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దీర్ఘకాలంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు బకాయిలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాటి ఆర్ధిక పరిస్థితి దిగజారుతుందని చెప్పారు.

దీని వల్ల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయడంలోనూ సమస్యలు వస్తున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రాష్ట్రా ప్రభుత్వాలు 17 బిలియన్‌ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement