Sunday, April 28, 2024

కోర్టుల్లో ఫిజికల్ హియరింగ్.. వారంలో రెండు సార్లే

ఫిజికల్ హియరింగ్‌ను కంప‌ల్స‌రీ చేయొద్ద‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌వీ రమణను సీనియ‌ర్ అడ్వొకేట్స్‌ కోరారు. ద‌స‌రా సెల‌వుల త‌ర్వాత బుధ‌వారం కోర్టు ప్రారంభం కాగానే ఈ చ‌ర్చ మొద‌లైంది. వారానికి రెండుసార్లు వ‌ర్చువ‌ల్ నుంచి ఫిజిక‌ల్ హియ‌రింగ్‌కు మారుస్తూ సుప్రీంకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఈ చ‌ర్చ జ‌రిగింది.

కాగా, కొన్ని కేసుల‌లో 50 నుంచి 60 పేజీల విచార‌ణ‌ల‌ను స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంద‌ని, లీగ‌ల్ రిప్రెజెంటేష‌న్ కోసం కోర్టు రూమ్‌లో బ్రీఫింగ్ చేయ‌డానికి ఒక లాయ‌ర్‌ను అనుమ‌తించాల‌ని కపిల్ సిబల్, తుషార్ మెహతాతోపాటు పలువురు సీనియర్ న్యాయవాదులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement