Friday, April 26, 2024

సౌదీ వీసాకు పోలీస్‌ ఎన్‌వోసీ (Noc) అక్కర్లేదు..

సౌదీ అరేబియా వెళ్లే భారతీయులకు ఆదేశం తీపికబురు చెప్పింది. సౌదీ వెళ్లే ఇండియన్స్‌ ఇకపై వీసా కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈమేరకు గురువారం ఢిల్లిలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. భారత్‌తో తమ దేశానికి ఉన్న బలమైన వ్యూహాత్మక బంధం దృష్ట్యా వీసాల కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

దీనిద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని పేర్కొంది. సౌదీ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వీసా అప్లికేషన్‌ ప్రక్రియ వేగవంతం కానుంది. పర్యాటక సంస్థలకు వీసా ప్రక్రియ సులభతరం అవుతుంది. పర్యాటకులకు కూడా డాక్యుమెంట్లభారం తగ్గుతుంది. ప్రస్తుతం 20 లక్షలమంది భారతీయులు సౌదీలో జీవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement