Thursday, April 25, 2024

శ్రీలంక ఆటగాడికి షరతులతో కూడిన బెయిల్‌

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మాజీ ఆటగాడు ధనుష్క గుణ తిలికకు గురువారం సిడ్నీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. సిడ్నీలోని డౌనింగ్‌ సెంట్రల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ జానెట్‌ వాహల్‌ క్విస్ట్‌ 1,50, 000 డాలర్ల పూచీ కత్తుతో అతడికి బెయిల్‌ ఇచ్చారు. టిండర్‌తో పాటు ఇతర డేటింగ్‌ యాప్స్‌ను, సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించవద్దని, ప్రతి రోజు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి సంతకం చేయాలని కూడా బెయిల్‌ కండిషన్స్‌లలో పేర్కొన్నారు. టిండర్‌ అనే డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళను అత్యాచారం చేశాడనే కేసులో సిడ్నీ పోలీసులు అక్టోబర్‌ 6న ధనుష్కను అరెస్ట్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement