Thursday, April 25, 2024

2024 టీ 20 ప్రపంచకప్‌ కోసం రోడ్‌ మ్యాప్‌

వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా 2024లో జరిగే టీ 20 ప్రపంచకప్‌ కోసం రోడ్‌ మ్యాప్‌ మొదలైందని టీమ్‌ ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో తాజాగా ముగిసిన టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో భారత్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

అయితే రేపటి(శుక్రవారం)నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీ ఆవి ష్కరణ కార్యక్రమంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో కలిసి హార్థిక్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా మీడియాతో పలు విషయాలపై పాండ్యా మాట్లాడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement