Thursday, April 25, 2024

International మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ సుంద‌రీ!


ఇస్లామిక్ దేశం సంచ‌ల‌న నిర్ణ‌యం
సౌదీ అరేబియా ప్రిన్స్ స‌రికొత్త నిర్ణ‌యం
మ‌హిళ‌ల‌పై క‌ట్టుబాట్ల స‌డ‌లింపు
తొలిసారిగా అంత‌ర్జాతీయ పోటీల‌కు ఎంట్రీ
మిస్ సౌదీగా రూమీ అల్ఖహ్తానీకి చాన్స్

సౌదీ అరేబియా అధికారికంగా ‘మిస్ యూనివర్స్’ పోటీలో భాగమైంది. ఇస్లామిక్ దేశం తరపున మొట్టమొదటి ప్రతినిధిగా రూమీ అల్ఖహ్తానీ చరిత్ర సృష్టించింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్న సౌదీ అరేబియా మరో అడుగు ముందుకు వేసింది. 27 ఏళ్ల మోడల్ అయిన రూమీ అల్ఖహ్తానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతర్జాతీయ అందాల పోటీలో దేశం నుండి పాల్గొనే మొదటి మహిళ తానే అని తెలియజేశారు. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారని రూమీ తెలిపారు.

సౌదీ సంస్కృతి వార‌స‌త్వాన్ని చాటేందుకు..

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన అల్ఖహ్తానీ కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఆసియన్‌లో ఇటీవల పాల్గొంది. “ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. సౌదీ సంస్కృతి ,వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నాను” అని రూమీ అల్ఖహ్తానీ తెలిపారు. మిస్ సౌదీ అరేబియా కిరీటంతో పాటు, ఆమె మిస్ మిడిల్ ఈస్ట్ (సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిళ్లను రూమీ ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశానికి మిస్ యూనివ‌ర్స్ కిరీటం సాధిస్తాన‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement