Thursday, April 25, 2024

Kerala: సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు..

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది.

కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వీణాతోపాటు ఆమె సంస్థ, మరికొందరిపై ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్ రూటైల్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్ కంపెనీకి 2018-19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్‌ మినరల్స్‌కు ఎక్సాలాజిక్‌ ఎలాంటి సర్వీస్‌ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్‌పై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement