Saturday, May 4, 2024

ప్రైవేట్ స్కూల్ టీచర్స్ బాధ్యత ప్రభుత్వానిదే…జగ్గారెడ్డి

ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు ,కాలేజీలు మూసి వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ప్రైవేటు స్కూల్స్ ,కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం మాత్రం దారణమన్నారు. ప్రభుత్వ మే ఆర్థిక సంక్షోభం లో ఉన్నప్పుడు ప్రజలు ఆర్థిక సంక్షోభం లో ఉండరా..?అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టించుకోవడం అంటే విద్యార్థులు ,విద్యార్థుల తల్లిదండ్రులను హాత్య చేసినట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ప్రైవేటు యాజమాన్యాల వత్తిడి వల్ల మానసికంగా తల్లిదండ్రులకు లేని రోగాలు వస్తున్నాయన్నారు జగ్గారెడ్డి.పేద ,మధ్యతరగతి కుటుంబ తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఓక పరిష్కార మార్గం చూపించాలన్నారు.

కరోనా ఇంతటితో పోయేది కాదు.ఇంకో సంవత్సరం కరోనా ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. లాక్ డౌన్ వచ్చి మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడొద్దు అనుకుంటే వైన్ షాపు లు ,బార్ లు ,సినిమా థియేటర్లు,పార్క్ లు మూసివేయాలన్నారు జగ్గారెడ్డి. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులో కనీసం సగమయినా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు చెల్లించాలి. లేని పక్షంలో భవిష్యత్ లో ఎప్పుడు ప్రైవేటు స్కూల్స్ ప్రారంభం అయినా ఒక సంవత్సరం ఫీజు ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రైవేటు స్కూళ్ల టీచర్లు కు జీతాలు ఆపకుండా చూడాల్సిన భాద్యత కూడా ప్రభుత్వం పై ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement