Tuesday, April 30, 2024

డెంగ్యూతో బాధపడుతోన్న సల్మాన్ ఖాన్..కరణ్ జోహార్ కి బిగ్ బాస్ బాద్యతలు

బిగ్ బాస్ 16వ సీజన్ కి హోస్ట్ గా చేస్తున్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అయితే ఆయన గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో బిగ్ బాస్ బాధ్యతలను నిర్మాత..దర్శకుడు కరణ్ జోహార్ కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన విషయాలను బిగ్ బాస్ టీం అఫీషియల్ గా వివరించింది. సల్మాన్ ఖాన్ హెల్త్ కండిషన్ ప్రస్తుతం అస్సలు బాగాలేదు. ఆయనకు డెంగ్యూ వ్యాధి రావడంతో చాలా డల్ అయిపోయారని తెలుస్తోంది. అంతేకాదు శరీరంలో ప్లేట్లెట్స్ కూడా బాగా పడిపోయాయి. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. పైగా ఆయన హెల్త్ కండిషన్ కాస్త సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. ఇక దీంతో సెలబ్రిటీలు సైతం సల్మాన్ ఖాన్ త్వరలోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కూడా త్వరలోనే కోలుకోవాలని ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు, అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement