Friday, May 3, 2024

స‌లార్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

స‌లార్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు ఈ చిత్రనిర్మాతలు.హోంబలే ఫిల్మ్ బ్యానర్ నిర్మాత అయిన విజయ్ కిరంగదూర్ సలార్ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. అలాగే ఈ సినిమా డెఫినెట్ గా తమ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే లెవల్లో ఉంటుందని చెప్పారు. దీంతో స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంది.మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కీలకపాత్రలలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement