Sunday, April 28, 2024

మధుర గతమా… కాలాన్నే ఆపకా… సాంగ్ రిలీజ్ – వీడియోతో

దుష్యంతుడికి దూరమైన శకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడు వారి ప్రేమకు, గాంధర్వ వివాహాని కి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టు-కుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచి పోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది? శకుంతల మనసుకి తగిలిన గాయాన్ని కాలం ఎ లా మాన్పించింది అనే విషయాలు తెలుసు కోవాలంటే శాకుంతలం సినిమా చూడాల్సిందే అని అంటు-న్నారు దర్శ కుడు గుణ శేఖర్‌.


ఆయన దర్శకత్వంలో 3డి -టె-క్నాలజీతో రూపొందు తోన్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’. దుష్యంత మహారాజుగా దేవ్‌ మోహన్‌ నటించగా.. శకుంతల పాత్రలో సమంత ఒదిగిపోయింది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వర ల్డ్‌ వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంగళవారం ఈ చిత్రం నుంచి ”మధుర గతమా… కాలాన్నే ఆపకా.. ఆగావే సాగకా.. అంగుళికమా.. జాలైనా చూపకా చేజారావే వంచికా…”అనే పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలోని పాటను శ్రీమణి రాయగా.. అర్మాన్‌ మాలిక్‌, శ్రే యా ఘోషల్‌ పాడారు.’శాకుంతలం’ చిత్రానికి సాయి మాధ వ్‌ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్‌ వి.జోసెఫ్‌ సిని మాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా చేస్తున్నారు. రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ నీ -టె-క్నీషియన్స్‌ వర్క్‌ చేయటం విశేషం. సమంత, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన శాకుంతలం చిత్రంలో మోహ న్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌, మధుబాల, గౌతమి, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, జిస్సు సేన్‌ గుప్తా కీలక పాత్రలను పోషించా రు. అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement