Saturday, April 27, 2024

సింగ‌పూర్ ఓపెన్‌లో సైనా శుభారంభం.. తొలి రౌండ్​ వరుస సెట్లలో గెలుపు!

తెలుగమ్మాయి భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ సింగ‌పూర్ ఓపెన్‌లో విజ‌యంతో మొద‌లుపెట్టింది. బుధవారం ప్రారంభ‌మైన సింగ‌పూర్ ఓపెన్ సూప‌ర్ 500 సిరీస్‌లో తొలి రౌండ్‌లో సైనా వ‌రుస సెట్ల‌తో మ్యాచ్‌ను నెగ్గి శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో భార‌త్‌కు చెందిన మాల్విక బ‌న్సోద్‌పై విజ‌యం సాధించింది.

21-18, 21-14 స్కోరుతో వ‌రుస సెట్ల‌ను కైవ‌సం చేసుకున్న నెహ్వాల్​ విజ‌యం సాధించింది. ఈ టోర్నీలో భార‌త క్రీడాకారుల‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు ద‌క్కాయి. పీవీ సింధు, ప్ర‌ణ‌య్‌లు కూడా తొలి రౌండ్‌ను నెగ్గారు. ఇక.. భార‌త్ త‌ర‌ఫున ఆడిన మరో క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement