Friday, May 10, 2024

Big story : ఉక్రెయిన్‌ ని చుట్టుముట్టిన రష్యా బలగాలు.. ఏ క్షణంలోనైనా వార్​ జరగొచ్చన్న అమెరికా..

ఉక్రెయిన్‌ పై ఏక్షణమైనా దాడి జరిపేందుకు రష్యా సైన్యం సర్వసన్నద్ధమైంది. ఉక్రెయిన్‌ చుట్టూ పొరుగు ప్రాంతాల్లో ఇప్పటికే తన బలగాలను మోహరించింది. గత వారం రోజులుగా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ట్యాంకులు, ఫిరంగుల నుంచి మందుగుండు సామాగ్రి, వైమానిక శక్తి వరకు అన్నింటినీ సిద్ధం చేసుకుంది. ఉక్రెయిన్‌ చుట్టూ సుమారు 1.3 లక్షల మంది రష్యా సైనికులు మోహరించి వున్నారు. పూర్తిస్థాయి దండయాత్రకు అవసరమైన 70 శాతం బలగాలను పుతిన్‌ సిద్ధంచేశారని అమెరికా ఇంటెలి జెన్స్‌ వర్గాలు తెలిపాయి. రేపటిలోగా యుద్ధం జరగవచ్చు అని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సుల్లివన్‌ హెచ్చరించారు.

పుతిన్‌ దాడిచేయాలని నిర్ణయించుకున్నారా? లేదా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, సరిహద్దుల్లో పరిణామాలు మాత్రం యుద్ధం అనివార్యమనే సంకేతాలిస్తున్నాయి. కొద్దిరోజులుగా ట్యాంకులు, భారీ కవచాలు సైబీరియాకు దూరంగా ఉన్న స్థావరాల నుంచి రైలులో తరలించబడ్డాయి. దాదాపు 100 రష్యన్‌ బెటాలియన్‌ వ్యూహాత్మక సమూహాలు, 1000 లేదా అంతకంటే ఎక్కువ మంది సైనికులతో కూడిన పోరాట దళాలు, వాయు రక్షణ, ఫిరంగి, రవాణా వాహనాలు బెలారస్‌ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో గుమికూడాయి. మరోవైపు యుద్ధ వాతావరణాన్ని నిలువరించే దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. జర్మన్‌ చాన్స్‌లర్‌ ఓలాప్‌ ఇరుదేశాలతో దౌత్య చర్చలు జరపుతున్నారు. నేడు మాస్కోకు చేరుకుని పుతిన్‌ను కలవనున్నారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేరకుండా నిషేధించాలన్న రష్యా డిమాండ్‌ కారణంగా దౌత్య చర్చలు ముందుకు సాగలేదు. మాస్కో దళాల ముట్టడి బీటీజీ అనేది వ్యూహాత్మక సమూహం. ఫిరంగులు, వైమానిక రక్షణ, లాజిస్టిక్స్‌తో కూడిన 600-1000 మంది సైనికుల సమూహమిది. 2015 రష్యా ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలోనూ మాస్కో డజను కంటే ఎక్కువ బీటీజీలను పంపలేదు.

కానీ ఈసారి 100 బీటీజీలను సరిహద్దుల్లోఉంచింది. మరింత తీవ్రమైన విషయం ఏమిటంటే, రష్యా 11 కంబైన్డ్‌ ఆర్మీలలో 10 విభాగాలు ఉక్రెయిన్‌ సమీపంలో ఉన్నాయి. నాలుగు నౌకాదళాలు బాల్టిక్‌, నల్ల సముద్రంలో ఉన్నాయి. ఐర్లాండ్‌ పశ్చిమతీరంలో క్షిపణి ప్రయోగాలతో సహా 140 కంటే ఎక్కువ యుద్ధ నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన విన్యాసాలను నిర్వహించింది. అదేవిధంగా ఇంజనీరింగ్‌, లాజిస్టిక్స్‌, మెడికల్‌ సౌకర్యా లు కూడా సరిహద్దుల్లో కనిపించాయి. యాంత్రిక దళాలకు వేగంగా ఇంధనం నింపే రష్యన్‌ పైప్‌లైన్‌ దళాలు క్రిమియాకు సమీపంలోని క్రాస్నో కారిడార్‌లో రోజుకు 80కి.మీ. వరకు పైప్‌లైన్‌ వేయగలవు.

దండయాత్ర ప్రారంభించే ప్రాంతాలివే..

ఉక్రెయిన్‌కు మూడు వైపులా రష్యా బలగాలను మోహరిం చి ఉన్నాయి. దక్షిణాన క్రిమియాలో రెండు దేశాల సరిహద్దు ల్లో రష్యావైపు, ఉత్తరాన బెలారస్‌లో, తూర్పు ఉక్రెయిన్‌లో ని డోనెట్స్‌, లుహాన్స్‌లలో మాస్కో బలగాలు సిద్దంగా ఉన్నాయి. యెల్న్యావద్ద భారీ సైనిక స్థావరం ఉంది. ఇది రష్యన్‌ ట్యాంకులను కలిగివుంది. 2014లో రష్యాలో విలీనమైన క్రిమియా కూడా దండయాత్రకు అనువైన క్షేత్రం గా ఉంది. 550 కంటే ఎక్కువ ట్రూప్‌టెంట్లు, వందల కొద్ది వాహనాలు క్రిమియా రాజధాని సింఫెరోపోల్‌కు ఉత్తరంగా వచ్చాయని మాక్సర్‌ చిత్రాలు గుర్తించాయి. క్రిమియా ప్రధా న నౌకాశ్రయంలో రష్యన్‌ యుద్ధనౌకలు లంగరు వేశాయి. బెలారస్‌ కూడా రష్యాకు కీలక స్థావరంగా మారనుంది.

- Advertisement -

మా పౌరుల్ని చంపుతున్నారు: రష్యా..

రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణంలో రష్యన్‌ టీవీ సంచలన కథనాలను ప్రసారం చేసింది. ఉక్రేనియన్‌ జాతీయవాదులు మా పౌరుల్ని చంపేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించింది. మీ పిల్లల్ని వైర్‌లకు వేలాడదీస్తామని బెదిరించారని వేర్పాటువాద పోరాట యోధుడు ఒకరు చెబుతున్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. కాగా, ఇది రష్యా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం అనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో ఉక్రెయిున్‌పై దండయాత్రకు ముందు కూడా రష్యా ఇదే విధమైన వ్యూహాన్ని అమలుచేసింది. ఉక్రెయిన్‌లో రష్యన్‌ పౌరుల రక్షణను కారణంగా చూపుతూ సైనికచర్యను క్రెవ్లిున్‌ సమర్థించుకుంది.

యుద్ధక్షేత్రానికి ఉక్రెయిన్‌ మాజీ సైనికులు..

రష్యా దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు తమవంతు సేవలు అందిస్తామని ఉక్రెయిన్‌ పౌరులైన మాజీ సైనికులు పేర్కొంటున్నారు. దేశం కోసం మళ్లి సరిహద్దుల్లోకి అడుగు పెడతాం. తుపాకులు చేపడతాం. మాతృభూమి రక్షణకు కట్టుబడివున్నాం అని ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌ జాతీయ గార్డులు కొంత మంది పౌరులకు కూడా ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తోంది. 79 ఏళ్ల వృద్ధురాలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మహిళలు, యువతతోపాటు వృద్ధులూ దేశరక్షణకు సిద్ధమ వుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement