Monday, April 29, 2024

ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు ‘గ‌ని’ మూవీ

మ‌హాశివ‌రాత్రి కానుక‌గా , ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది గ‌ని చిత్రం. కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందించిన చిత్రం గ‌ని. ఈ మూవీలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించాడు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లుబాబీ, సిద్ధూముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించిన ఈచిత్రంలో సాయి ముంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఉపేంద్ర‌,జ‌గ‌ప‌తిబాబు,సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్ర బృందం విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, లిరిక‌ల్‌సాంగ్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. గతేడాది డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ చిత్రం విడుద‌ల కావాల్సింది. కానీ పోటీగా పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో గ‌ని పోస్ట్‌పోన్ అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన‌ విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement