Wednesday, May 8, 2024

120క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడి

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగిస్తోంది. తాజాగా 120 క్షిపణులతో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై విరుచుకుపడింది. ప్రజలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా పెట్టుకుందని రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు మైఖేల్‌ పొడోయాక్‌ పేర్కొన్నారు. ఈ దాడిలో ముగ్గురు మరణించారని తెలిపారు. కీవ్‌తోపాటు ఖార్కివ్‌, ఒడిశా, ఎల్వివ్‌, జైటోమిర్‌ నగరాలపై కూడా క్షిపణుల దాడి జరిగిందన్నారు. వాయు, నావికా స్థావరాలపై రష్యా అన్ని వైపుల నుంచి క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ వైమానిక దళం పేర్కొంది.

ఉక్రెయిన్‌ కూడా కమికేజ్‌ డ్రోన్‌లను ఉపయోగించినట్లు పేర్కొంది. కీవ్‌ నగరంలో సుమారు 16 క్షిపణులను తిప్పికొట్టారు. కానీ క్షిపణుల తాకిడికి శిథిలాలు ఇళ్లపై పడ్డాయి. మైకోలైవ్‌ ప్రాంతంలో ఐదు క్షిపణులను అడ్డుకున్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఒడిశా ప్రాంతంలో 21 క్షిపణులను కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. క్షిపణుల శిథిలాలు ఇళ్లపై పడడంతో కొందరు గాయపడ్డారు. ఎల్వివ్‌ నగరంలో పలుమార్లు భారీ పేలుళ్లు వినిపించాయని మేయర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement