Wednesday, May 15, 2024

రుద్రుడు చిత్రం నుండి లారెన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

మ‌ల్టీ టాలెంటెడ్ లారెన్స్ న‌టించిన రుద్రుడు చిత్రం నుండి లారెన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింద‌ది చిత్ర యూనిట్. దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి అనే బేస్ లైన్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. జాతరలో విలన్ గ్యాంగ్ భరతం పడుతున్న లారెన్స్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మొత్తం షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. తమిళ .. తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement