Tuesday, April 30, 2024

వైద్య సౌకర్యాలు మెరుగుప‌రిచేందుకు రూ.90కోట్ల నిధులు: పాముల పుష్పశ్రీవాణి

గుమ్మలక్ష్మీపురం, (ప్రభన్యూస్‌) : భద్రగిరి, సాలూరు ఆసుపత్రిల్లో ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.90 కోట్లు నిధులు సమకూర్చి, అదనపు వసతులను నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. జీఎల్‌పురం మండలంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించిన గర్భిణీ స్త్రీల వసతిగృహాన్ని ప్రారంభించిన సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భద్రగిరి 30 ప డకల్‌ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా, సాలూరు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసామన్నారు. గతంలొ భద్రగిరి ఆసుపత్రిలో ఒక వైద్యుడు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆరుగురు వైద్యుల పోస్టులను మంజూరు చేసామని తెలిపారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 40 మంది వరకు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.

రాష్టృ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఆసుపత్రుల అభివృద్ధితో పాటు, విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాలల ఏర్పాటులు మంజూరు చేసామన్నారు. అలాగే పార్వతీపురం ఆసుపత్రిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈమె వెంట పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి నాగభూషణరావు, ఏపీహెచ్‌ఎమ్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎం. సత్యప్రభాకర్‌, ఎంపీపీ కె. దీనమయ్య, జెడ్పీటీసీ రాధిక, జీఎల్‌పురం, ఎల్విన్‌పేట సర్పంచ్‌లు, గౌరీశంకర్‌ రావు, చైతన్య స్రవంతి, ఏఎంసీ చైర్మన్‌ వెంకటరావు, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గిరి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement