Friday, May 17, 2024

వాల్మీకి వ‌ర్గాల‌ను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి – మంత్రి గుమ్మనూరు

రాష్ట్రంలో వాల్మీకి వర్గాలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరులో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన గావించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ…. వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోడుమూరు నియోజకవర్గం పర్యటనలు అంటే త‌నకు చాలా ఇష్టమ‌ని మంత్రి గుమ్మనూరు తెలిపారు. ప్రతి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం వాల్మీకి మహర్షి దేవాలయం వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతరం ఆర్.ఖానాపురం గ్రామంలో వాల్మీకి సోదరులు ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ డా”మధుసూదన్, బీజేపీ ఓబీసీ మోర్చ కార్యదర్శి డా పార్థసారథి, మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, వాల్మీకి సంఘం నాయకులు బోయక్రాంతి నాయడు, వినోద్ కుమార్, వి.జి.ఆర్ కొండయ్య, ఆర్.ఖానాపురం గ్రామ సర్పంచ్, వాల్మీకి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement