Tuesday, May 21, 2024

Karnataka | మంచినీళ్లు వృదా చేస్తే రూ.5వేలు జరిమానా.. కర్నాటక ప్రభుత్వం నిర్ణయం

నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న కర్నాటకలో మంచినీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకించి బెంగళూరులో కొత్త నిబంధనలను విధించింది. మంచినీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. వాహనాలను కడిగేందుకు, నిర్మాణ పనులకు, సినిమాహాల్స్‌, మాల్స్‌లో ఇతర పనులకు మంచినీటిని వాడరాదని హెచ్చరించింది.

ఈ నిబంధనలను అతిక్రమిస్తే తొలిసారి రూ.5వేలు జరిమానా విధిస్తారని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే, ఆ మొత్తానికి అదనంగా రూ.500 చొప్పున చేర్చి వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. 1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరులో రోజుకు 2,600 – 2800 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతూండగా కేవలం 1500 మిలియన్‌ లీటర్లే లభ్యమవుతున్నాయి. దాదాపు ఇదే పరిస్థితి తుమకూరు, ఉత్తర కర్ణాటక జిల్లాల్లోనూ నెలకొంది. రాష్ట్రంలో 236 తాలుకాలలో కరవు పరిస్థితులు ఏర్పడగా, 219 తాలూకాల్లో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడింది. కాగా ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement