Saturday, May 4, 2024

రూ. 90 కోట్లతో ఆర్టీసీకి 400 బస్సులు..

ఆర్టీసీని పరరక్షించేందుకు సీఎం కేసీఆర్‌ పూర్తి నిబద్దతతో ఉన్నారని, సంస్థకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. బస్‌భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బాజిరెడ్డి సంస్థకు బస్సుల కొరత ఉన్న మాట వాస్తవమేనని 2828 బస్సులు కావాల్సి ఉందన్నారు. త్వరలోనే రూ.90 కోట్లతో 400 బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. దాదాపు 3 వేల మందికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాల్సి ఉందని, ఇందుకోసం రూ.500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు.దాదాపు 1200ని కారుణ్య నియమాకాలు చేపట్టాల్సి ఉందన్నారు. స్క్రాప్‌ కింద కొన్ని బస్సులను తొలగించాల్సిన అవసరం ఉందని, తద్వారా కొంత డబ్బు సమకూరుతుందన్నారు. మొత్తంగా సంస్థను ప్రజాబీష్టం మేరకు తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నారు.

సంస్థను గాడిన పెట్టేందుకు ఎండీతో పాటు తాను కూడా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొద్ది రోజులుగా ఆర్టీసీపై ప్రజల్లో చర్చ కూడా మొదలైందన్నారు. సిబ్బంది కూడా సంస్థను పరిరక్షించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పండుగలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, సమ్మక్క జాతరకు విస్తృత ఏర్పాట్లు చేశామని, అయితే ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన రాలేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement