Sunday, April 28, 2024

మహేష్‌బాబు విడుదల చేసిన ‘పెళ్లిసందD’ మూవీ ట్రైలర్

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ సినిమా ట్రైలర్‌ను బుధవారం ఉదయం సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశాడు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో లుక్ పరంగా, డాన్స్, ఫైట్స్ పరంగా రోషన్ మంచి మార్కులు కొట్టేసేలానే కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు శ్రీలీల కథానాయికగా పరిచయమవుతోంది.

దర్శకుడు రాఘవేంద్రరావు ఈ మూవీలో ప్రత్యేకమైన పాత్రను పోషించాడు. ఆయన తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ మహేష్ ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, పోసాని, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం భారీ స్థాయిలో సందడి చేసినట్టుగానే అనిపిస్తోంది. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement