Thursday, May 2, 2024

Big Boss5: ఈ వారం నామినేషన్ లోకి వచ్చిందెవరంటే..?

లుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సిజన్ 5 అలరిస్తోంది. మూడో వారంలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. రెండో వారంలో ఉమా ఎలిమినెట్ కాగా.. ఈ వారం ప్రియ, ప్రియాంక సింగ్, లహరి, రవి, శ్రీరామ్ లు నామినేషన్ లోకి వచ్చారు. అయితే, నామినేషన్ సందర్భంగా నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యాడు. జెస్సీ.. మానస్‌, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. దీంతో ఒకరు చెప్తేనే నన్ను నామినేట్‌ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ నటరాజ్ మాస్టర్ ఘాటుగా అన్నాడు. తర్వాత షణ్ముఖ్‌.. ప్రియ, లహరిని నామినేట్ చేయగా.. శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను నామినేట్ చేసింది. ఇక, హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను, కాజల్‌.. ప్రియాంక, ప్రియను, విశ్వ.. నటరాజ్‌ మాస్టర్‌, ప్రియను నామినేట్‌ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన తరువాత లహరి, ప్రియాంక, ప్రియ, మానస్‌, శ్రీరామ్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లే కంటెస్టెంట్ ఎవరు ?అన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement