Monday, May 6, 2024

పెరిగిన బంగారం ధరలు…టుడే గోల్డ్ అప్డేట్

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరింకే దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇక మగువలు అయితే బంగారం అంటే పడి చచ్చిపోతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు… మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం నేడు చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 43,600 కి చేరగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 260 పెరిగి రూ. 47,560 కి చేరింది.

ఇక బంగారం ధరలు పెరగగా.. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 67,500 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement