Thursday, May 2, 2024

కృష్ణంరాజు న‌న్ను పెద్ద‌న్న‌లా ప్రోత్స‌హించారు-చిరంజీవి ట్వీట్

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రెబల్‌స్టార్‌ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమది ఆత్మీయ అనుబంధం అని, తనను పెద్దన్నలా ప్రోత్సహించారని చెప్పారు. ఆయన లేనిలోటు వ్యక్తిగతం తనకు, సినీ పరిశ్రమకు తీరని లోటని ట్వీట్‌ చేశారు. ‘కృష్ణంరాజు గారు ఇక లేరనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా పోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్‌ స్టార్‌’కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేనిలోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్‌కు నా సానుభూతిని తెలియజేస్తున్నాన‌న్నారు చిరంజీవి .

Advertisement

తాజా వార్తలు

Advertisement