Thursday, May 2, 2024

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, పార్లమెంట్‌లో పూలే విగ్రహం ఏర్పాటు.. కేంద్రానికి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించిన కేంద్రప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు మాత్రం కల్పించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిబా పూలే 132వ వర్దంతి సందర్బంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పూలే చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు.

సుప్రీంకోర్టు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లను సమర్దిస్తూ ఇచ్చిన తీర్పుతో దేశంలో 50 శాతం సీలింగ్‌కు కాలం చెల్లిందని, బీసీ రిజర్వేషన్లను కూడా 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేలా చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ కోరారు. పార్లమెంటులో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, జాతీయ పార్కులు, ప్రాజెక్టులు,స్టేడియంలు, విమానశ్రయాలకు పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement