Monday, January 30, 2023

ముంపు బాధితులకు కోలేటి చేయుత.. 4 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేత

భారీ వర్షాలతో ముంపునకు గురైన రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చేయూతనిచ్చారు. నాలుగు వేల కుటుంబాలకు 40 లక్షల రూపాయలకు సంబంధించి.. 18 రకాల నిత్యావసర సరుకులు అందించారు. మంగళవారం నియోజకవర్గంలోని జనగామ, సప్తగిరి కాలనీలో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ఈ సరుకులు అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటు అండగా నిలుస్తామన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, మరోసారి ముంపునకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతోనే నిత్యవసర సరుకులు అందజేశామన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement