Sunday, May 5, 2024

తెలంగాణ లో తగ్గిన టెస్ట్ లు… కొత్తగా 5186 కరోనా కేసులు

తెలంగాణ‌లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే దానికి కారణం లేకపోలేదు. టెస్ట్ లను కూడా అదే స్థాయిలో తగ్గించి చేస్తున్నారు. గడచిన 24గంట‌ల్లో కేవ‌లం 69,148మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా… 5,186మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. అలాగే చికిత్స పొందుతూ మ‌రో 38మంది మ‌ర‌ణించారు. మరోవైపు కొత్త‌గా 7994మంది వైర‌స్ నుండి కోలుకున్నారు. దీనితో మొత్తం రాష్ట్రంలో నమోదు అయిన కేసులు 4,92,385కి చేరగా యాక్టివ్ కేసులు 648,462కి చేరింది.

అలాగే ఇప్పటివరకు 2704 మంది కరోనా తో మృతి చెందారు. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 4,21,219 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త‌గా వ‌చ్చిన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ లో 904కేసులొచ్చాయి.సెకండ్ వేవ్ మొద‌లైన రోజుల్లో తెలంగాణ‌లో ల‌క్షా ఇర‌వై వేల‌కు పైగా టెస్టులు చేశారు. కానీ ఇప్పుడు అందులో స‌గానికి స‌గం త‌గ్గించిన‌ట్లుగా ప్ర‌భుత్వం లెక్క‌లు చెప్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement