Friday, April 26, 2024

సంపూర్ణేష్ బాబు మరో కొత్త చిత్రం

సంపూర్ణేష్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు సంపూర్ణేష్ బాబు. అయితే సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తన 5వ చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. మే 9న ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు న్యూ అవతార్ లో కనిపించనున్నాడట. చివరిసారిగా కొబ్బరి మట్ట సినిమా తో సంపూర్ణేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వీటి తో పాటు టక్కరి దొంగ చక్కని చుక్క, రాధాకృష్ణ చిత్రాలలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement