Friday, April 19, 2024

ఓటీటీ లో సీటిమార్ ?

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం సిటిమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆంధ్ర కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్…తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతున్నారు. నిజానికి ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదల కాకపోవటానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని మేకర్ చెప్పుకొచ్చారు.

అయితే అసలు కారణం ఇది కాదట. సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ రేటు నిర్మాత చెప్పాడట. దీంతో డిస్ట్రిబ్యూటర్ అంత మొత్తంలో కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో నిర్మాత సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారట. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట .ఈ మేరకు నిర్మాత ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడట. మొత్తం రైట్స్ ను ఓటీటీలకే విక్రయించాలని నిర్మాత భావిస్తున్నాడట. అందుకు సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement