Wednesday, May 1, 2024

Gas Cylinder: తగ్గిన కమర్షీయల్​ గ్యాస్ సిలిండర్ ధరలు

పెరుగుతున్న ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతున్న సమయంలో.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించింది. క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించి గుడ్​న్యూస్​ చెప్పాయి.

ఇవాళ్టి నుంచి కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39.50 తగ్గించాయి. అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. కానీ వ్యాపారవేత్తలు ఈ మినహాయింపు యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, కొత్త ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1757 నుంచి రూ. 1796.50కి చేరింది. అదేవిధంగా ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1749 నుంచి రూ.1710కి తగ్గింది. కోల్కతాలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1908 నుంచి రూ.1868.50కి తగ్గింది. చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1968 నుంచి రూ.1929కి తగ్గింది. ఇక, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గినప్పటికీ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్యతరగతి ప్రజలు నిరాశకు గురయ్యారు.

ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.903గా ఉంది. కోల్కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.929. దేశీయ గ్యాస్ ధర చెన్నైలో రూ.918.50 కాగా, ముంబైలో రూ.902.50గా ఉంది. చివరిసారిగా ఆగస్టు 30న దేశీయ సిలిండర్ ధరలను తగ్గించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 200 రూపాయల మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. కమర్షియల్ సిలిండర్ల ధరల్లో ప్రతి రోజూ నిరంతర మార్పులు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement