Wednesday, May 1, 2024

ఆగస్టు 1న రెడ్‌మీ 12 సిరీస్‌ లాంచింగ్‌

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ బ్రాండ్‌ రెడ్‌మీ కొత్త సిరీస్‌ ఫోన్లను విడుదల చేయనుంది. ఆగస్టు 1న ఇవి మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి రెడ్‌మీ12 సిరీస్‌ ఫోన్ల టీజర్‌ రిలీజ్‌ చేసింది. రెడ్‌మీ12 4జీ, రెడ్‌మీ12 5జీ ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. రెడ్‌మీ12 4జీ ఫోన్‌ ధర రూ.9,999, రెడ్‌మీ12 5జీ ఫోన్‌ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

రెడ్‌మీ12 4జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ రామ్‌ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌, 6జీబీ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. రెడ్‌మీ12 5జీ ఫోన్‌ కూడా రెండు వేరియంట్లు 6జీబీ విత్‌ 127 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌, 8జీబీ రామ్‌ విత్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ల్లో లభిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement