Monday, February 26, 2024

వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను కాపాడిన ఎస్ఐ.. ప్రశంసించిన డిజిపి

కాటారం, మల్హర్ (ప్రభ న్యూస్) : వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన జయశంకర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ఎస్ఐ వడ్లకొండ నరేష్ ను తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ ట్విట్టర్లో ప్రశంసించారు. మలహర్ మండలం కొయ్యూరు గ్రామపంచాయతీలోని పివి నగర్ చెందిన ఇద్దరు గిరిజన రైతులు మోటర్ పైపులను తీసుకొచ్చేందుకు మానేరు సమీపంలోకి వెళ్లారు.

అంతలోనే మానేరు నది ఉధృతి పెరగడంతో ఆ వరదల్లో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన కొయ్యూరు ఎస్ఐ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ఇద్దరి వద్దకు ఎస్సై నరేష్ తాడు సహాయంతో వెళ్లి ఆ ఇద్దరు రైతులను ఒడ్డుకు చేర్చాడు. ఈ విషయం తెలిసిన తెలంగాణ డిజిపి అంజని కుమార్ కొయ్యూరు ఎస్ఐ నరేష్ కు సెల్యూట్ చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement