Tuesday, May 14, 2024

రూ.2కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం స్వాధీనం

ఎర్రచందనం అక్రమార్కులకు బంగారంగా మారింది. ఏపీతో సహా కర్నాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు… ఆరు లారీలుగా సాగిపోతోంది. క‌ష్ట‌ప‌డ‌కుండా ఎక్కువ డ‌బ్బులు సంపాదించాల‌నే ఉద్దేశంతో అక్ర‌మార్కులు అడ్డ‌దారులు దొక్కుతున్నారు. అందులో భాగంగానే ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ… అధికారుల‌కు దొరికిపోతున్నారు. అయితే చెన్నైలో భారీ ఎర్రచందనంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ హిల్స్ లోని ఓ పాత సామాన్ల గోడౌన్ లో దాచిపెట్టిన సుమారు రెండు కోట్లు విలువచేసే 179 ఎర్రచందనం దుంగలను రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు నాయకత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప‌ట్టుకున్న ఎర్రచంద‌నం విలువ రూ.2కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement