Sunday, April 28, 2024

రెడ్ అలర్ట్: హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది..ఈ క్రమంలో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు. సహాయం కోసం 040 – 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని వారు నగర ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. . అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement