Thursday, May 2, 2024

ఫుల్ స్వింగ్‌లో రికవరీ.. నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్..

భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. IPL సమయంలో గాయపడిన కేఎల్ రాహుల్ మెల్లిగా గాయం నుండి కోలుకుంటున్నాడు. గాయంతో దాదాపు 6 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భారత క్రికెట్ జట్టు కీలక ప్లేయర్ కేఎల్ రాహుల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కేఎల్ రాహుల్ పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఆసియా కప్ వరకు కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా ఉంటాడని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. కేఎల్ రాహుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, KL రాహుల్ బ్యాటింగ్ కాకుండా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇక గాయం నుండి త్వ‌ర‌గా కోలుకుని.. కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో ఆడితే, నంబర్-5లో బ్యాటింగ్ చేయడం ఖాయం. కేఎల్ రాహుల్ నంబర్-5లో బ్యాటింగ్ చేయడం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తుంది. ఇది కాకుండా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ప్రపంచకప్ జ‌ర‌గ‌నుంది.. అదీకాక‌ ప్రపంచకప్ 2023 భారత గడ్డపై జ‌ర‌గ‌నుంది. మ‌రి కేఎల్ రాహుల్ ఫిట్ గా ఉన్నారనే వార్త టీమ్ ఇండియా అభిమానులకు రిలీఫ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు.

https://twitter.com/kunaalyaadav/status/1686646894196625408
Advertisement

తాజా వార్తలు

Advertisement