Sunday, April 28, 2024

క్రిస్మ‌స్ గిఫ్ట్ అందింది.. థ్యాంక్యూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు.. ట్వీట్ చేసిన ద‌ర్శ‌కుడు

క్రిస్మ‌స్ బ‌హుమ‌తిని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నుండి అందుకున్నారు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్. క్రిస్మస్ బహుమతిని అందుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు’ అని శ్రీరామ్ ట్విట్ చేస్తూ, బహుమతికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు. దీంతో మరో సరికొత్త కథతో పవన్ తో సినిమా తీయాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా 2021 లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన కారణంగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లు నిర్మాతలు ప్రకటించలేదు. మొత్తానికి ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.

https://twitter.com/GAYATHRIGSAK/status/1605605888164651010

Advertisement

తాజా వార్తలు

Advertisement