Wednesday, May 1, 2024

అదరగొడుతోన్న.. అన్ స్టాపబుల్ సీజన్2 గ్లింప్స్

అన్ స్టాపబుల్ సీజన్2 గ్లింప్స్ అదరగొడుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో హీరోలు ప్రభాస్ , గోపీచంద్ పాల్గొన్నారు.ఈ మేర‌కు చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. ప్రభాస్‌ ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో ఫస్ట్ టైమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ టాక్ షోకి వస్తున్నారని గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ప్రభాస్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉండటం విశేషం. ప్రభాస్‌ ని చూసి ఆడియెన్స్ హోరెత్తించారు. ఫ్లైయింగ్‌ కిస్సులతో ఫిదా చేశారు. వారికి డార్లింగ్‌ కూడా ఫ్లయింగ్‌ కిస్సులివ్వడం విశేషం. ప్ర‌భాస్..గోపీచంద్ లు వచ్చాక హీరో బాలకృష్ణ కాస్త సరదాగా సన్నివేశాలు చేశారు. కళ్లజోడు పైకి ఎగరేశారు. ఆ తర్వాత ఏయ్‌.. ఏం చెప్తున్నావ్‌ డార్లింగ్‌ అని ప్రభాస్‌ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు ప్రభాస్‌ని రమ్మని అనగా, డార్లింగ్‌ వద్దు సర్‌ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంటుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కి ప్రభాస్‌ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మరింత ఆకట్టుకుంటుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement