Saturday, April 20, 2024

సత్ప్రవర్తనతో నడుచుకోవాలి : పెద్దపల్లి డీసీపీ రూపేశ్‌

పెద్దపల్లి : గతంలో నేర చరిత్ర కలిగి ఉన్న వారు సత్ప్రవర్తనతో ఉండాలని పెద్దపల్లి డీసీపీ చెన్నూరి రూపేశ్‌ పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి సర్కిల్‌ పరిధిలోని రౌడీ షీటర్స్‌, సస్పెక్ట్‌ షీటర్స్‌కు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పలు నేరాలకు పాల్పడిన వారు మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని, వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ లు ప్రదీప్‌కుమార్‌, ఇంద్ర సేనా రెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, ఉపేందర్, తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement