Thursday, May 9, 2024

కియారా.. సిద్థార్థ్ ల‌కి RC15 చిత్ర యూనిట్ విషెష్

ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం RC15.ఈ చిత్రంలో హీరో రామ్ చ‌ర‌ణ్..హీరోయిన్ గా కియారా అద్వాని న‌టిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్‌.జే సూర్య, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటి అంజల్‌, రామ్‌ చరణ్‌ భార్యగా కనిపించనుంది.
కాగా రీసెంట్ గా బాలీవుడ్‌ నటుడు సిద్దార్థ్‌ మల్హోత్రాను వివాహం చేసుకుంది కియారా. ఈ సందర్భంగా RC15 చిత్రబృందం ఈ జోడీకి శుభాకాంక్షలు తెలిపింది. చిత్రయూనిట్‌ మొత్తం పూలు చల్లుతూ ఓ స్పెషల్‌ వీడియాను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. కాగా తాజాగా ఈ వీడియోపై కియారా స్పందించింది. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. ఇలా RC15 టీమ్‌మొత్తం ఒకదగ్గరే కనిపించే సరికి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement