Friday, April 26, 2024

ఇడియట్2తో హీరోగా రవితేజ కుమారుడు.. క్లారిటీ ఇచ్చిన హీరో

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా రవితేజకు రెండో చిత్రం ఇడియట్. 2002లో విడుదలైన ఇడియట్ సూపర్ హిట్ కొట్టింది. మూస ధోరణిలో సాగే ప్రేమకథలకు భిన్నంగా ఇడియట్ తెరకెక్కింది. కామెడీ, ఎమోషన్స్, లవ్ కలగలిపి పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఇడియట్ ని పూరి జగన్నాధ్ తీర్చిదిద్దారు. పూరి, రవితేజ కెరీర్స్ కి ఇడియట్ మంచి పునాది వేసింది. ముఖ్యంగా రవితేజ హీరోగా నిలదొక్కున్నారు. ఇడియట్ కి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. ఇడియట్ మూవీ సీక్వెల్ తో రవితేజ తన కుమారుడు మహదాన్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దీనిపై రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ఓ విలేకరి… ఇడియట్ సీక్వెల్ తో మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట నిజమేనా అని అడిగాడు. ఈ వార్తల్లో నిజం లేదు. ఇడియట్ సీక్వెల్ మా అబ్బాయితో చేసే ప్రణాళిక లేదు, వినడానికే ఇది కొత్తగా ఉందని రవితేజ తెలిపారు. మహదాన్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు అనిల్ రావిపూడి అతన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రను మహదాన్ చేశాడు. అంధుడిగా అతడు నటించి మెప్పించాడు. హీరోల వారసులు హీరోలు కావడం ఖాయం కాబట్టి. ఇడియట్ సీక్వెల్ తో కాకపోయినా… త్వరలో మహదాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనివార్యం. లేటైనా రావడం పక్కా.

Advertisement

తాజా వార్తలు

Advertisement