Thursday, April 25, 2024

కేర‌ళ మాజీ సీఎం ఊమ‌న్ చాందీకి సీబీఐ క్లీన్ చిట్‌

కేర‌ళ మాజీ సీఎం ఊమ‌న్ చాందీకి లైంగిక వేధింపుల కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. చీఫ్ జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఆ నివేదిక‌ను స‌మ‌ర్పించారు. సోలార్ స్కామ్‌లో ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్న ఓ మ‌హిళ .. మాజీ సీఎంపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. మాజీ సీఎం చాందీతో పాటు మాజీ కేంద్ర మంత్రి కేసీ వేణుగోపాల్‌, ఇత‌ర నేత‌ల‌పై ఆ మ‌హిళ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. 2012లో ఆ మ‌హిళ‌ను వేధించిన‌ట్లు రిపోర్ట్ న‌మోదయ్యింది. అయితే సీపీఎం నేతృత్వంలోని కేర‌ళ ప్ర‌భుత్వం.. 2021లో ఆ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. అయితే ఈ కేసులో కేర‌ళ మాజీ సీఎంకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement