Saturday, May 18, 2024

ర‌వితేజ “ధ‌మాకా” షురూ..

రవితేజ సినిమా ‘ధమాకా’ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ.విశ్వప్రసాద్‌, సహ నిర్మాత వివేక్‌ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. తాజా చిత్రీకరణలో రవితేజ, ఫైటర్స్‌పై యాక్షన్‌ సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్‌, లక్ష్మణ్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో షూటింగ్‌ జరుగుతోంది. ”హై ఆక్టేవ్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తున్నట్టు” నిర్మాత టీజీ.విశ్వప్రసాద్‌ తెలిపారు.

సినిమాలో కీలకమైన ఎపిసోడ్ అని అన్నారు. ప్రత్యేకంగా సెట్‌ వేశామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ‘పెళ్లిసందడి’ ఫేమ్‌ శ్రీలీల నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి కథ, మాటలు ప్రసన్నకుమార్‌ బెజవాడ, సంగీతం భీమస్‌ సిసిరిలియో, ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement