Friday, May 3, 2024

రేషన్‌ స్కీం పొడగింపు, సీఎం యోగీ తొలి నిర్ణయం.. 3 నెలల వరకు ఫ్రీ రేషన్‌

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ రెండో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం.. శనివారం తొలిసారి తన మంత్రివర్గంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్‌ సరుకులను అందించాలని నిర్ణయించారు. సంక్షే పథకాలు, నేరస్తులపై కఠిన చర్యలతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకు పొడగించాలని యోగీ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో.. యూపీ వ్యాప్తంగా 15కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. పారదర్శకమైన పాలన అమలు చేయాలని మంత్రులకు యోగీ సూచించినట్టు సమాచారం. 2020లో కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద.. ప్రతీ కుటుంబానికి ప్రతీ నెల ఐదు కిలోల చొప్పున బియ్యం అదనంగా అందిస్తున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న తొలి నిర్ణయం ఇదే.

పోలీసులకు కీలక ఆదేశాలు..

నేరస్తుల పాలిట యోగీ సింహ స్వప్నంగా నిలుస్తున్నారు. వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై నేరాలకు పాల్పడినట్టయితే స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, లేకపోతే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తామని ఇప్పటికే యోగీ పలుసార్లు ప్రకటించారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు ఎంతో గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో.. అధికారులు ఆ నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. దీంతో వెంటనే నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలాంటి విషయాల్లో యోగీ కఠినంగానే వ్యవహరిస్తూ వచ్చారు. రెండోసారి పగ్గాలు చేపట్టిన తరువాత.. ఈ తరహా దూకుడే ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement