Saturday, May 18, 2024

నాగ‌చైత‌న్య‌తో రాశీ ఖ‌న్న‌.. సెట్‌లో ఏం చేస్తున్నారో తెలుసా!

గ‌తేడాది ల‌వ్‌స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్ సాధించిన‌ నాగ‌చైత‌న్య ఈ ఏడాది బంగార్రాజుతో సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచాడు. రెండు వ‌రుస విజ‌యాల‌తో టైర్‌2 హీరోల‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అక్కినేని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య‌ ఇండ‌స్ట్రీలో త‌న న‌ట‌న‌, అభిన‌యంతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్‌కు భిన్నంగా క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్న ఈ హీరో ప్ర‌స్తుతం న‌టిస్తోన్న మూవీ ‘థాంక్యూ’. విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి నాగ‌చైత‌న్య‌, రాశిఖ‌న్నా క‌లిసి ఉన్న ఫోటోల‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ఈ ఫొటోలో నాగ‌చైత‌న్య ఫోన్ చూస్తుండ‌గా.. రాశిఖ‌న్నా ఎవ‌రితోనో మాట్లాడుతున్న‌ట్లు ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య హ‌కీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. అవికాగోర్, మాళ‌వికా నాయ‌ర్‌లు కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య, విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ‘ధూత’ అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement